: టాస్క్ ఫోర్స్ ను పంపేది ఈ సమయంలోనా..?: రోజా
కేంద్రంపై వైఎస్సార్సీపీ మహిళా నేత రోజా మండిపడ్డారు. తుపాను, వరదలతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో.. నష్టం అంచనా వేసేందుకు అధికారులను పంపాల్సింది పోయి, విభజనపై చర్చించేందుకు టాస్క్ ఫోర్స్ ను పంపడమేంటని కేంద్రంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకే కేంద్రం ఈ సమయంలో టాస్క్ ఫోర్స్ ను పంపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విభజన కారకులను నరకాసురుడిలా వధించాలని పిలుపునిచ్చారు.