: సోనియాపై మండిపడ్డ మంద కృష్ణ


భారీవర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైనా గానీ సోనియా గాంధీ రాష్ట్రానికి రాకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. రైతులు, ప్రజలు భారీగా నష్టపోతే.. వారిని పరామర్శించాల్సిన బాధ్యత సోనియాకు లేదా? అని ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఇక, సీఎం కిరణ్ నిజంగా సమైక్యవాదే అయితే, కేంద్రానికి సహకారం అందించరాదని అన్నారు. రాష్ట్రానికి జీవోఎంనుం పంపాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని మంద కృష్ణ తెలిపారు. విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News