: హైదరాబాదులో ఢిల్లీ తరహా పోలీసింగ్?
హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా సంస్థకు చెందిన సుపరిపాలనా భవన్ లో కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి బృందం సమావేశం ముగిసింది. ఉమ్మడి రాజధానిలో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థ వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే శాంతి భద్రతల సమస్యపై బృందం చర్చించింది. ఉన్నతాధికారులు, ఐపీఎస్ ల అభిప్రాయాలను ఉన్నత స్థాయి బృందం సేకరించింది.