: క్రీజులో సచిన్.. నిలకడగా ఆడుతున్న ముంబయి
హర్యానాతో రంజీ మ్యాచ్ లో ముంబయి జట్టు నిలకడగా ఆడుతోంది. లాహ్లీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో హర్యానా విసిరిన 240 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 102 పరుగులతో ఆడుతోంది. ముంబయి గెలుపుకు ఇంకా 138 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో 8 వికెట్లున్నాయి. బరిలో సచిన్ (7 బ్యాటింగ్), కౌస్తుభ్ పవార్ (46 బ్యాటింగ్) ఉండడంతో ఆ జట్టు విజయం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో హర్యానా 134, ముంబయి 136 పరుగులు చేశాయి. ఇక, రెండో ఇన్నింగ్స్ లో హర్యానా 241 పరుగులు చేసింది.