: హెచ్ఆర్డీ కార్యాలయంలో ముగిసిన టాస్క్ ఫోర్స్ బృందం భేటీ


హైదరాబాద్ హెచ్ఆర్డీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ భేటీ ముగిసింది. రేపు మరోసారి ఈ టీమ్ సమావేశం కానుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను పరిశీలించేందుకు ఈ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కె.విజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, బీఎస్ఎఫ్ ఐజీ సంతోష్ మెహ్రా, ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ మిశ్రా, ఎన్ హెచ్ఏ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ శర్మ, అప్పా జాయింట్ డైరెక్టర్ దామోదర్, ఏసీబీ డైరెక్టర్ కుమార్ విశ్వజిత్, సిటీ జాయింట్ సీపీ మల్లారెడ్డి, ఆపరేషన్స్ డీజీ జేవీ రాముడు, ఏపీపీఎస్సీ సెక్రటరీ చారూ సిన్హా, మాజీ డీజీపీ అరవింద్ రావు, అప్పా డైరెక్టర్ మాలా కొండయ్య, హోం డిపార్ట్ మెంట్ నుంచి శాంతన్, సీపీ అనురాగ్ శర్మలతో పాటు పలువురు మాజీ అధికారులు కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News