: ఇన్ఫోసిస్ కు రూ. 219 కోట్ల జరిమానా?


కచ్చితత్వానికి మారుపేరుగా చెప్పుకునే భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... నీతిమాలిన పనులు చేస్తోందా? అంటే, అవుననే అంటోంది యూఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్. ఇన్ఫోసిస్ చేసిన తప్పిదాలకు దాదాపు రూ. 219 కోట్ల (35 మిలియన్ డాలర్లు) వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే జరిమానాకు అవసరమైన మొత్తాన్ని రెడీ చేసుకున్నట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే... ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను బిజినెస్ లేదా వర్క్ వీసాలపై కాకుండా విజిటర్ వీసాలపై భారత్ నుంచి అమెరికాకు పంపిస్తోందని అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ కన్నెర్రజేసింది. ఇది వీసా నిబంధనలను అతిక్రమించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇన్ఫోసిస్ అమెరికాలో విచారణ ఎదుర్కొంటోంది. చేసిన తప్పుకు ఇన్ఫోసిస్ కు రూ. 219 కోట్ల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇదే జరిగితే విదేశాల్లో మన పరువు గంగ పాలైనట్లే!

  • Loading...

More Telugu News