: అత్యాచారాలపై అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేసిన వారి రహస్య అవయవాలను కత్తిరించి పారేయాలన్నారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా భోకర్దాన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేపిస్టులను క్షమించరాదని, వారిని ఉరి తీయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, అజిత్ పవార్ వ్యాఖ్యలను ప్రతిపక్ష శివసేన తప్పుబట్టింది. మహిళలపై అత్యాచారాలు జరగకుండా నిరోధించలేని మహారాష్ట్ర సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే.. పవార్ అలా మాట్లాడారని శివసేన ప్రతినిధి నీలం గోరే విమర్శించారు.