: ప్రవాస భారతీయ కార్మికులకు పెన్షన్
ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన 'మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షా యోజన' పథకాన్ని కేంద్ర మంత్రి వయలార్ రవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభించారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు అవసరమయ్యే(ఈసీఆర్) దేశాలలోని భారతీయ కార్మికులకు ఈ పథకం భద్రత కల్పించనుంది. విదేశాలలో ఉన్న సమయంలో వారికి జీవిత బీమా కల్పన.. స్వదేశానికి వచ్చిన తర్వాత పెన్షన్ లాంటి సదుపాయాలను ఇది అందిస్తుంది. ఇందులో కార్మికులు తమ వాటాగా కొంత చెల్లించాల్సి ఉంటుంది.