: నేడు సీబీఐ బొగ్గు స్కాం రిపోర్టును పరిశీలించనున్న సుప్రీంకోర్టు


కీలకమైన బొగ్గు కుంభకోణంపై సీబీఐ సమర్పించిన స్టేటస్ రిపోర్టును నేడు సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఈ స్కాంలో సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ పేరు వినిపిస్తుండడం, ఇండియన్ బిజినెస్ టైకూన్ కుమార మంగళం బిర్లా పేరు చార్జ్ షీట్లో ఉండడం, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి.పరేఖ్ తెరమీదకు రావడం లాంటి ఎన్నో కీలక మలుపులున్నాయి. ఈ నేపథ్యంలో, సీబీఐ స్టేటస్ రిపోర్టులో ఏముందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

గతంలో పరేఖ్ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖ... ప్రస్తుతం సీబీఐ చేతిలో ఉందన్న సమాచారం సంచలనం రేపుతోంది. ఆ లేఖలో, అప్పటి గనుల శాఖ మంత్రి శిబూ సోరెన్ ఆధ్వర్యంలోని బొగ్గు మాఫియా కనుసన్నల్లో మొత్తం బొగ్గు గనుల శాఖ నడుస్తోందని పరేఖ్ తెలిపినట్టు సమాచారం. దీనికి తోడు, తాను చట్టాని కన్నా పెద్దవాడిని కాదని... తనను దోషిగా భావిస్తే కోర్టు బోనెక్కడానికి సిద్ధమని ప్రధాని ప్రకటించడం కూడా తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సీబీఐ రిపోర్టులో ఏముందన్న అంశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News