: సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు
భారీ వర్షాలకు రాష్ట్రంలో 16 జిల్లాలు దెబ్బతిన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ, విపత్తును గుర్తించడం, సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 30 లక్షల ఎకరాల పంట నాశనమైందని ప్రభుత్వం చెబుతోందని, కానీ, అసలు నష్టం మరింత తీవ్రంగా ఉందని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. విభజనపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.