: శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు తనయుడు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. 'దూసుకెళ్తా' చిత్ర యూనిట్ తో కలిసి ఆయన తిరుమల విచ్చేసి ఈ ఉదయం వీఐపీ బ్రేక్ లో వెంకన్న సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'దూసుకెళ్తా' చిత్రాన్ని త్వరలో మలయాళంలోనూ విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక, తమిళ నటి శ్రీదేవి (మంజుల కుమార్తె) కూడా నేడు తన జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు.