: రాత్రికి రాత్రి సచిన్ కాలేరు: ద్రవిడ్
సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాక.. అలాంటి ఆటగాళ్లు తయారుకావడానికి అవకాశం ఉందని, కానీ, సమయం పడుతుందని మాజీ క్రికెటర్ ద్రవిడ్ అన్నాడు. రాత్రికి రాత్రి సచిన్ అవుదామని భావించరాదని సూచించారు. సచిన్ స్థాయికి ఎదగడానికి సమయం తీసుకుంటుందన్నారు. భారత జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మ వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని.. అయితే, వారిని సచిన్ అంతటి ఆటగాళ్ళనలేమని, తమకంటూ పేరు తెచ్చుకోవడానికి వారికి కొంత సమయం పడుతుందన్నారు.