: పెరిగిన రెపో రేటు.. హౌసింగ్ లోన్లు మరింత ప్రియం


భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ... ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉందని తెలిపారు. దీనిని అరికట్టడానికి మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి అనుగుణంగా రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు రాజన్ ప్రకటించారు. దీంతో, రెపో రేటు 7.75 శాతానికి చేరింది. రఘురాం రాజన్ రెండు నెలల వ్యవధిలో వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. దీనికి అనుబంధంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే ప్రమాదం ఏర్పడింది. దీంతో, హౌసింగ్ లోన్లు మరింత భారంగా మారనున్నాయి.

బ్యాంకులను బలోపేతం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ తరపు నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని రాజన్ అన్నారు. దీనికి తోడు, కొత్త బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐ అనుకూలంగా ఉందని తెలిపారు. క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ ఆర్)ను మాత్రం ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకుండా 4 శాతం వద్ద నిలకడగా ఉంచింది.

ఎంఎస్ ఎఫ్ రేటును మరో 0.25 శాతం తగ్గిస్తున్నట్టు రఘురాం రాజన్ తెలిపారు. ఈ చర్యతో డాలర్ మారకంతో పోలిస్తే మన రూపాయి విలువ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 18వ తేదీన ద్రవ్య పరపతి విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని రఘురాం రాజన్ తెలిపారు.

  • Loading...

More Telugu News