: చెన్నైలోని పోస్టాఫీసులపై పెట్రో బాంబు దాడులు


చెన్నైలోని మైలాపూర్, మందవల్లి పోస్టాఫీసులపై గత అర్ధరాత్రి పెట్రో బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. దీనిపై చెన్నై పోలీసులు మాట్లాడుతూ.. అగంతకులను 24 గంటల్లో పట్టుకుంటామని ప్రకటించారు. దాడికి పాల్పడిన సమయంలో అగంతకుల వివరాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News