: సరిత, నేను చట్టబద్ధంగా ఎప్పుడో విడిపోయాం: భర్త ముఖేష్


తను ఇండియాలో లేని సమయం చూసి తన భర్త ముఖేష్ మరో పెళ్లి చేసుకున్నాడంటూ సీనియర్ నటి సరిత నిన్న(సోమవారం) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త ముఖేష్ తాజాగా స్పందించాడు. సరిత మాట్లాడినవన్నీ అర్ధం లేని ఆరోపణలేనని ఖండించాడు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నాడు. తామిద్దరం ఎప్పుడో చట్టబద్ధంగా విడిపోయామని తెలిపాడు. అందుకు సంబంధించిన పత్రాలను రిజస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాకే తాను రెండో వివాహం చేసుకున్నట్లు వెల్లడించాడు. తగిన ఆధారాలు, డాక్యుమెంట్స్ చూపకుంటే రెండో వివాహానికి రిజిస్ట్రార్ అనుమతించేవారు కాదని చెప్పాడు.

  • Loading...

More Telugu News