: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి


హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది. ఈ ఉదయం వట్టినాగులపల్లి వద్ద ఆగి ఉన్న లారీని డీసీఎం ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులందరూ హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన వారు. వీరంతా కర్ణాటకలోని బీదర్ లో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో డీసీఎంలో 18 మంది ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో వ్యక్తి చనిపోయాడు.

  • Loading...

More Telugu News