: ఎక్కణ్నుంచి పోటీ చేయాలనే విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం: బాలకృష్ణ


వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయనున్న సినీ నటుడు బాలకృష్ణ పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. ఎక్కణ్నుంచి పోటీ చేయాలనే విషయంలో పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని ఆయన తెలిపారు.

ప్రస్తుతం బాలకృష్ణ తన అమ్మమ్మ ఊరైన కొమ్మమూరులో ఉన్నారు. అంతకుముందు ఆయన స్వగ్రామం నిమ్మకూరులో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడిపారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర కొమ్మమూరుకు చేరుకున్న పిదప బాలకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. 

  • Loading...

More Telugu News