: ఆర్ బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేడే
ఈ రోజు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలకమైన ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించనుంది. ఈ సమీక్షలో కీలక రేట్లను పెంచే అవకాశాలను కొట్టిపారేయలేమని... ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా ఆకాశాన్నంటుతున్నాయని... ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే, కేవలం పరపతి విధాన సమీక్షతో మాత్రమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేమని... ఇంధన ధరలతో పాటు వివిధ చర్యల ద్వారా మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని రఘురామ్ రాజన్ అన్నారు.