: హైదరాబాద్ చేరుకున్న హోంశాఖ ఉన్నత స్థాయి బృందం


రాష్ట్రంలోని శాంతి భద్రతలను పరిశీలించి నివేదికను తయారుచేయడానికి ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి హోంశాఖ బృందం హైదరాబాద్ చేరుకుంది. గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతం చేసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విజయకుమార్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని, అందరితో చర్చించిన తర్వాత మాట్లాడతామని విజయకుమార్ అన్నారు. రాష్ట్ర విభజన పరిస్థితులపై చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయనే విషయం కూడా ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.

  • Loading...

More Telugu News