: మీ కిటికీని తీసేసి ఓ విద్యుత్‌ ప్లాంట్‌ పెట్టండి


అవును, మీ ఇంటి కిటికీని తొలగించేసి దాని స్థానంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే ఓ ప్లాంట్‌ను బిగించుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? పైగా ఆ విద్యుదుత్పత్తి ప్లాంటు కిటికీలాగానే ఉన్నదనుకోండి. ఇక పాత కిటికీని తీసేశాం అనే బాధ కూడా ఉండదు. పైగా సదరు కిటికీ, గదిని చల్లబరిచే లక్షణం కూడా కలిగి ఉన్నదనుకోండి. అబ్బో.. ట్రిపుల్‌ బొనాంజా అన్నమాట. అచ్చంగా ఇలాంటి ట్రిపుల్‌ బొనాంజా కిటికీని చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు.

షాంఘై యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ హైటెక్‌ కిటికీలో రెండు పాలీకార్బొనేట్‌ పొరలమధ్య వెనెడియం ఆక్సైడ్ ను నింపారు. రూం టెంపరేచర్‌ ఉన్నప్పుడు ఈ ఫ్రేం పారదర్శకంగా కిటికీలాగానే ఉంటుంది. 68 డిగ్రీల సెల్సియస్‌ వరకు పరారుణ కిరణాలు దీని ద్వారా గదిలోకి రాగలుగుతాయి. ఆ తర్వాత వేడి ఉంటే.. వాటిని వెనక్కి తిప్పి కొడుతుంది. గదిలో ఉష్ణోగ్రత పెరగకుండా చూస్తుంది. ఈ ఫ్రేం నుంచి నలువైపులకు చెల్లాచెదురు అయ్యే కాంతిని ఒడిసిపట్టుకుని విద్యుత్తుగా మార్చడానికి ఫోటో వోల్టయిక్‌ సెల్స్‌ ఏర్పాటు కూడా ఉంటుంది. ఇది 1.5 వోల్టుల కరెంటు బల్బును వెలిగిస్తుందిట.

  • Loading...

More Telugu News