: సవతుల పోరులో ఆడాళ్లు ఎంతకైనా తెగిస్తారు
'ఇంటిలోని పోరు ఇంతింతగాదయా' అన్న శతకకారుడు బహుశా మగాళ్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పక్షపాతబుద్ధితో సెలవిచ్చి ఉంటాడు. నిజానికి సవతిపోరు కూడా మామూల్ది కాదు. కేవలం పెళ్లయిన వారి విషయంలో మాత్రమే కాదు, ప్రేమికుల విషయంలో కూడా... మరో అమ్మాయి తనకు పోటీ ఉన్నదంటే.. అమ్మాయిలు రెచ్చిపోవడం గ్యారంటీ అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రేమ విషయంలో ఇద్దరమ్మాయిల మధ్య పోటీ ఉన్నదంటే గనుక... వారిక విచ్చలవిడిగా ఒకరి గురించి మరొకరు తీవ్రంగా దుష్ప్రచారం చేసుకుంటూ గడిపేస్తారట. పోటీగా ఉండే అమ్మాయిపై ఎంతటి విష, అబద్దపు ప్రచారం చేయడానికైనా అమ్మాయిలు వెనకాడరని.. కెనడాలో జరిగిన అధ్యయనం చెప్తోంది. ప్రేమ సమయంలోనే ఇది మరీ ఎక్కువ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ట్రేసీ వలియన్ కోర్ట్ చెబుతున్నారు.మామూలుగా నిందలు వేయడం, వదంతుల ప్రచారం వంటివి స్త్రీపురుషులు ఇద్దరిలోనూ ఉంటాయి గానీ.. మహిళల్లో ఈ ద్వేషం చాలా ఎక్కువగా ఉంటుందని, ఎంతదూరమైనా తీసుకువెళ్తుందని చెబుతున్నారు.