: భారత్ క్రికెటర్లకు దావూద్ కార్లు ఆఫర్ చేశాడు: వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1986 షార్జాకప్ ఫైనల్ మ్యాచ్ కు ముందురోజు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాడని ఓ ఆంగ్ల ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ నెగ్గితే ఒక్కో భారత ఆటగాడికి టయోటా కారు ఇస్తానని ఆఫర్ చేశాడని వెల్లడించాడు. అయితే, వెంటనే రూము నుంచి బయటకు పోవాలని కపిల్ దేవ్ చెప్పడంతో దావూద్ వెళ్లిపోయాడని చెప్పాడు. తర్వాత దావూద్ తన ఆఫర్ ను కూడా విరమించుకున్నాడన్నాడు. దావూద్ ని ఓ వ్యాపారిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మహమూద్ తమకు పరిచయం చేశాడని పేర్కొన్నాడు.