: పోలవరం ఆపడమే మా అజెండా: ఈటెల రాజేందర్
ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఆపడమే తమ అజెండా అని అన్నారు. గోదావరిలో కేటాయించిన 1,400 టీఎంసీల్లో 1,040 టీఎంసీలే తెలంగాణకు కేటాయించారన్నారు. కేవలం 400 టీఎంసీలే ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని పేర్కొన్న ఈటెల, తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులు పూర్తయ్యాకే ఆంధ్రా ప్రాంతానికి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని ఆయన అన్నారు. జగన్ తో టీఆర్ఎస్ కుమ్మక్కైందన్న వార్తలు నిరాధారమైనవని ఈటెల ఖండించారు. అలాగే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమయ్యే ప్రతిపాదనే లేదని కూడా స్పష్టం చేశారు.