: చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారు : చిరంజీవి
వరద బాధితులతో చంద్రబాబు రాజకీయాలు చేయడం తగదని చిరంజీవి విమర్శించారు. వరద బాధితులను పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు చిరంజీవి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 10 వేల చొప్పున సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, అవసరమైతే రైతుల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు.