: 2008 గ్రూప్-2 ఫలితాలు వెల్లడి
నియామకాల విషయంలో ఏపీపీఎస్సీ నత్తనడక ధోరణి మరోసారి నిరూపితమైంది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఫలితాలను ఏపీపీఎస్సీ ఈరోజు ప్రకటించింది. ఫలితాలను నేటి నుంచి ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 375 మంది ఎంపికయ్యారు. కాగా, మరో రెండు రోజుల్లో 2011 గ్రూప్-2 ఫలితాలను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.