: హైదరాబాదులో బాంబు కలకలం


హైదరాబాదులోని నల్గొండ చౌరస్తాలో బాంబు వదంతి కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహనానికి టిఫిన్ బాక్స్ తగిలించి ఉంది. దీన్ని బాంబుగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో, వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. వాళ్లు అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించగా... అది బాంబు కాదని సురేష్ అనే వ్యక్తికి చెందిన టిఫిన్ బాక్సుగా తేలింది. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News