: రాజకీయ వారసత్వాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి: దిగ్విజయ్
రాజకీయ వారసత్వాలను బద్దలు కొడదామంటూ బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ మాటలపై కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. దేశంలో వారసత్వ రాజకీయాలు సహజమేనని సమర్ధించారు. అన్ని పార్టీలలోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయన్నారు. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతికి రాసిన లేఖను తానింకా చూడలేదని పునరుద్ఘాటించారు.