: జగన్ తో కాంగ్రెస్ కుమ్మక్కైందన్న వ్యాఖ్యలపై జేసీని నిలదీసిన బొత్స
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఫోన్ లో నిలిదీశారు. రాష్ట్రంలోని వరద ముంపుపై జేసీ బొత్సకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ ఫిక్సింగ్ చేసుకుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బొత్స మాట్లాడారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అందుకు జేసీ సమాధానమిస్తూ.. కాంగ్రెస్ నుంచి వెళ్లమని చెప్పే అధికారం ఎవరికీ లేదన్నారు. జగన్ తో కుమ్మక్కు జరగలేదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అయితే, జేసీతో జగన్ విషయంపై ఏమీ మాట్లాడలేదని సత్తిబాబు తెలిపారు.