: 16 జిల్లాల్లో రైతులు పూర్తిగా నష్టపోయారు : సీఎం
వర్షాల వల్ల 16 జిల్లాల్లో రైతులు పూర్తిగా నష్టపోయారని సీఎం కిరణ్ తెలిపారు. వరదలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గత మూడేళ్లలో పెట్టుబడి రాయితీని రూ. 10 వేలకు పెంచామని అన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు మార్కెట్ యార్డులో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జిల్లాకు కలిగిన నష్టం, చెల్లించాల్సిన పరిహారం లాంటి విషయాలపై సమీక్ష నిర్వహించారు.