: రాహుల్ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు


యూపీ ముజఫర్ నగర్ బాధితులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈసీని కలిసిన కమలం పార్టీ ఓ లేఖ సమర్పించింది. ముజఫర్ నగర్ బాధితులను పాకిస్థాన్ ఐఎస్ఐ రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, దీనికోసం వారితో సంబంధాలు నెరుపుతోందని... రాజస్థాన్ ర్యాలీలో రాహుల్ అన్న మాటలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ... ఈసీని కలిశామని, సరైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.

  • Loading...

More Telugu News