: తియానన్మెన్ స్క్వేర్ వద్ద కారు బీభత్సం.. ముగ్గురి మృతి


చైనాలో ప్రముఖ పర్యాటక స్థలం తియానన్మెన్ స్క్వేర్ వద్ద వేగంగా వచ్చిన కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ముందుగా పాదచారులను ఢీకొట్టి అనంతరం తియానన్మెన్ స్క్వేర్ వద్ద బారీకేడ్లను దాటుకుని ముందుకెళ్లి మండిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మరణించారు. అంతేకాకుండా పలువురు పర్యాటకులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. సందర్శనను నిలిపివేసి, పర్యాటకులు అందరినీ అక్కడి నుంచి తరలించారు. 1989లో పెద్ద ఎత్తున జరిగిన ప్రజాస్వామ్య పోరాటానికి చిహ్నంగా ఈ స్క్వేర్ నిలుస్తోంది.

  • Loading...

More Telugu News