: విజయవాడలో తెలుగుదేశం జలదీక్ష
కృష్ణానది తీరం వెంబడి రక్షణ గోడను నిర్మించాలని డిమాండ్ చేస్తూ... తెలుగుదేశం పార్టీ నేతలు విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా నేత గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ... వరదల సమయంలో కృష్ణానది తీరం వెంబడి ఉన్న గ్రామాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రక్షణ గోడ నిర్మించి... నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కాపాడాలని అన్నారు.