: శిల్పాశెట్టిని ఆపతరమా..!


శిల్పాశెట్టి తెగ ఉత్తేజానికి గురవుతోంది. ఆమె కాలు భూమ్మీద ఆగట్లేదు. ఏమైందంటే.. ముంబై అండర్ వరల్డ్ మాఫియా కథతో ఆమె ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దిష్కియాన్ పేరుతో తీస్తున్న ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. శిల్పా ఆనందానికి కారణమిదే. 'ఇది మసాలా వినోదాత్మక చిత్రం, మాఫియాపై ఆసక్తికరమైన చిత్రం. శిల్పాశెట్టి ముంబై మాఫియాపై సినిమా తీస్తుందని ఊహించుకోండి. వినడానికే వింతగా ఉంది కదూ. గ్యాంగ్ స్టర్ గా మారాలనుకునే యువకుడి కథ. నాకెంతో నచ్చింది' అంటూ కథ చెప్పింది. సక్సెస్ అయితే ఓకే. ప్రేక్షకులు నచ్చకుంటే శిల్పా అప్పుడెలా రియాక్టవుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News