: కరుణానిధి భార్యను ప్రశ్నించిన సీబీఐ


డీఎంకే అధినేత ఎమ్ కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ ను చెన్నైలోని నివాసంలో 2జీ కేసులో సీబీఐ ఈ రోజు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. 84 సంవత్సరాల దయాళు అమ్మాళ్ అనారోగ్యం కారణంగా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఇంటివద్దే కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారని ఆమె తరపు లాయర్ తెలిపారు.

  • Loading...

More Telugu News