: సిండికేట్ అయిన మిర్చి వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తాం : ఖమ్మం కలెక్టర్


ఖమ్మం మిర్చి యార్డులో పచ్చి మిర్చి కొనుగోళ్లను వ్యాపారులు నిలిపివేయడంతో... రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మిర్చి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు జరపాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా... వ్యాపారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికితోడు, తాము చెప్పిన ధరకు ఇవ్వకపోతే మిర్చి కొనుగోలు చేయమని వ్యాపారులు హెచ్చరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీనరేష్ తీవ్రంగా స్పందించారు. సిండికేట్ అయిన ముగ్గురు వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News