: సంద్రంలో ఉందామా...!
సముద్రంలో ఒక ఇల్లు కట్టుకుని అందులో నివాసం ఉంటే... ఇది ఊహించడానికే భలే సరదాగా ఉందికదూ... అదే అలాంటి నగరమే ఉంటే... సరిగ్గా ఇలాంటి నగరం కోసమే ఫిల్ ప్రయత్నిస్తున్నారు. సముద్రంలో చక్కటి నగరాన్ని నిర్మించాలని ఫిల్ పాలే కలలు కంటున్నారు. ఇందుకోసం ఫిల్ ఇరవైఏళ్ల పాటు శ్రమించి ఒక చక్కటి డిజైన్‌ను కూడా తయారుచేశారు. తాను డిజైన్ చేసిన నగరంలో వందమంది నివాసం ఉండవచ్చని, ఇందులో నివసించేవారు ఆహారం, గాలి వంటివాటికోసం బయటి ప్రపంచంపై ఆధారపడాల్సిన పనిలేదని ఫిల్ చెబుతున్నారు. అంతేకాదు... ఇలాంటి నగరాన్ని గురించి ఫిల్ పలు పుస్తకాలను కూడా రాశారట. ఎలాగైనా తన జీవిత కాలంలో ఇలాంటి సాగర నగరాన్ని తీర్చిదిద్దుతానని ఫిల్ చెబుతున్నారు. ఒకవేళ ఫిల్ దాన్ని సాధిస్తే... అదే సాగర నగరంగా ఉంటుందేమో...!