: బర్డ్‌ఫ్లూకు టీకా తయారయ్యింది
ప్రతి ఏడాది అధిక సంఖ్యలో కోళ్ల మరణానికి, దానితోబాటు మనుషుల మరణానికి కారణమవుతున్న బర్డ్‌ఫ్లూ వ్యాధికి నిరోధక టీకాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వ్యాధి ముందుగా కోళ్లకు, ఇరత పక్షులకు వస్తుంది, వాటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకడం ద్వారా చైనాలో గత మార్చినుండి 45 మందికి పైగా మృతి చెందారు. దీనికి కారణమైన హెచ్7ఎన్9 బర్డ్‌ఫ్లూ వైరస్‌ను నిరోధించే కొత్త టీకాను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జీజియాంగ్ విశ్వవిద్యాలయం, హాంకాంగ్ యూనివర్సిటీ, వ్యాధి నియంత్రణ నిరోధ కేంద్రం తదితర సంస్థల ఉమ్మడి పరిశోధనలతో ఈ టీకాను అభివృద్ధి చేశారు. హెచ్7ఎన్9 బర్డ్‌ఫ్లూ వైరస్ నిరోధానికి రూపొందించిన తొలి టీకా మందు ఇదే కావడం విశేషం.