: జగన్ వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారు: లగడపాటి


జగన్ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వారే ఆయనపై నిర్ణయం తీసుకుంటారని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, సీఎం పదవి కోసమే జగన్ సమైక్యవాదం అంటున్నారని ఆరోపించారు. గతంలో జగన్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాడని గుర్తు చేశారు. 2009 తర్వాతే జగన్ తెలంగాణ బాణీ వినిపిస్తున్నాడని విమర్శించారు. సమైక్యవాదినని చెప్పుకుంటున్న జగన్ ఏపీఎన్జీవోలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని, ఇద్దరూ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పిన తర్వాతే సోనియాను తిడుతున్నాడని లగడపాటి అన్నారు. జగన్ ను ఆయన కాంగ్రెస్ దత్తపుత్రుడిగా అభివర్ణించారు. దత్తపుత్రుడి బలం తగ్గకుండా కాంగ్రెస్ సహకరిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News