: ఇది నా ప్రెస్ మీట్.. సాక్షి వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు: లగడపాటి
జగన్ మీడియాపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విరుచుకుపడ్డారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి నుంచి జగన్ ను విమర్శించడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. దీన్ని ఓ మీడియా సంస్థ ప్రతినిధి ప్రశ్నించడంతో లగడపాటి ఉగ్రుడయ్యారు. 'వెళ్ళి జగన్ సంక నాకు' అని సదరు ప్రతినిధిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది తన ప్రెస్ మీట్ అని, సాక్షి మీడియా సంస్థకు చెందిన వాళ్ళెవరైనా ఉంటే వెళ్ళిపోవాలని సూచించారు. అనంతరం మీడియా సమావేశం కొనసాగింది.