: గాజువాకలో పర్యటించిన పురంధేశ్వరి
కేంద్ర మంత్రి పురంధేశ్వరి నేడు విశాఖ జిల్లా గాజువాకలో పర్యటించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన సాయం చేయాలని ఆమె అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఆమె వెంట పర్యటించిన వారిలో జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి ఉన్నారు.