: సీఎంను ఆకాశానికెత్తేస్తున్న పితాని
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పితాని సత్యనారాయణ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాసిన సీఎం కిరణ్ ధైర్యశాలి అని కొనియాడారు. విభజనకు సీఎం సహకరిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని పితాని అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఏ త్యాగం చేయడానికైనా కిరణ్ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇక, జగన్ ను తరిమికొట్టేందుకు సమైక్యవాదులు సమయం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.