: సచిన్ ఎన్నికల ప్రచారం చేయడు: రాజీవ్ శుక్లా


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయనున్నాడని ఇటీవల మీడియాలో వార్తలు జోరుగా షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటికి తెరదించుతూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పష్టమైన ప్రకటన చేశాడు. ఈ వార్తలన్నీ నిరాధారమని కొట్టిపారేశాడు. కాన్పూర్ నుంచి ఆయన పీటీఐ వార్తాసంస్థతో ఫోన్ లో మాట్లాడుతూ, సచిన్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడంటూ వచ్చినవన్నీ ఊహాగానాలేనని, పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. అతను క్రికెట్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారం ఎలా చేస్తాడని శుక్లా ప్రశ్నించారు. ప్రస్తుతం సచిన్ హర్యానాతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతరం వచ్చే నెలలో విండీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో ఆడాల్సి ఉంది. ఆ సిరీస్ తో సచిన్ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News