: కుమారుడికి సీఎం పదవి కోసం కేసీఆర్ బేరాలు ఆడుతున్నారు: మోత్కుపల్లి


టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగారు. హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జాప్యానికి కారణం కేసీఆరేనని మండిపడ్డారు. కుమారుడికి సీఎం పదవి కోసం ఇప్పుడాయన ఢిల్లీ పెద్దలతో బేరసారాలు జరుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్.. తాజాగా కుమారుడికి సీఎం పదవి కావాలంటూ కొత్త డిమాండ్లు తెస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాకపోతే అందుకు కేసీఆర్ దే బాధ్యత అని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News