: ఢిల్లీ పీఠం కాంగ్రెస్ పార్టీదే: రాహుల్ ధీమా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ గెలుపు పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఢిల్లీలో అభివృద్ధి జరగలేదని విపక్షంతో సహా ఎవరూ అనలేరని.. 1998 నుంచి సాగిన తమ పాలనే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో వ్యవస్థ, పలు కాలనీల క్రమబద్ధీకరణ, ఆహార భద్రత బిల్లు వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమయ్యాయని రాహుల్ పేర్కొన్నారు.