: రాష్ట్రంలో వరదలపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేసిన నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా కోస్తాలోని అన్ని జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని అధికారులు సీఎంకు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా, పంటనష్టం భారీగానే చోటు చేసుకుందని వివరించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలు కొనసాగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు మహీధర్ రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, విపత్తు నివారణ విభాగం కన్వీనర్ టి. రాధ తదితరులు పాల్గొన్నారు.