: ఓ స్థానం ఎగబాకిన పుజారా


ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత యువ సంచలనం చటేశ్వర్ పుజారా ఓ ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో పుజారా ఎనిమిదో స్థానం నుంచి ఏడోస్థానానికి ఎగబాకాడు. ఇక, బౌలింగ్ విషయానికొస్తే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతని ర్యాంకులో ఎలాంటి మార్పులేదు.

కాగా, టీమిండియా సారథి ధోనీ విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తో కలిసి సంయుక్తంగా 20వ ర్యాంకులో నిలిచాడు. నెంబర్ వన్ బ్యాట్స్ మన్ గా దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలీర్స్ అవతరించాడు. డివిలీర్స్ తన సహచరుడు హషీమ్ ఆమ్లాను వెనక్కినెట్టి అగ్రపీఠాన్ని అధిష్ఠించాడు. బౌలింగ్ లోనూ సఫారీలే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. డేల్ స్టెయిన్ (1), వెర్నాన్ ఫిలాండర్ (2) తమ స్థానాలను పదిల పరుచుకున్నారు. టీమ్ విభాగంలో భారత్ మూడోస్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News