: రవీంద్రనాథ్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షల పిటిషన్ విచారణ వాయిదా
ఫోర్జరీ కేసులో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిని లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతించాలని పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది. ఈ కేసులో రవీంద్రనాథ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కడప కోర్టులో లొంగిపోగా, కోర్టు ఆయన్ను ఒక్క రోజు కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగిసిన పిదప బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ కేసులో రవీంద్రనాథ్ రెడ్డిపై సత్య శోధన పరీక్షతోపాటు బ్రెయిన్ మ్యాపింగ్ కూ అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.