: కాంగ్రెస్ పార్టీకి పేదరికం అంటే ఏమిటో తెలియదు: మోడీ
నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. పాట్నా సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి పేదరికం అంటే ఏమిటో తెలియదన్నారు. కాంగ్రెస్ 2004, 2009 ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి పదేళ్ళయినా నియత్రించలేకపోయిందని విమర్శించారు. యూపీఏ పాలనలో పేదలు మరింత పేదలుగా మారారాని అన్నారు. దేశం మార్పు కోరుకుంటోందని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.