: కేంద్ర మంత్రి బలరాం నాయక్ కు ఈసీ నోటీసులు
ఎన్నికల నియమావళి ఉల్లఘించారనే ఆరోపణలతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ కు ఎలక్షన్ కమిషన్(ఈసీ) షోకాజు నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ లో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా.. ఈ నెల 16న భోపాల్ లో బలరాం నాయక్ మాట్లాడుతూ, ఓబీసీ విద్యార్థుల హస్టళ్ల నిర్మాణానికి 20 కోట్ల వరకూ మంజూరు చేస్తామని ప్రకటించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. నిర్ణీత సమయంలోపు ఎలాంటి సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది.