: నిన్నటి సభతో వారి బండారం బట్టబయలైంది: చంద్రబాబు
హైదరాబాదులో జరిగిన సమైక్య శంఖారావం సభతో వైఎస్సార్సీపీ-కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న ఒప్పందం బట్టబయలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, నిన్నటి సభతో ఒకరి వ్యవహారంలో మరొకరు జోక్యం చేసుకోరన్న విషయం స్పష్టమైందని తెలిపారు. సభకు అనుమతివ్వడం ద్వారా కాంగ్రెస్ సహకరించిందని, ఇక తనవంతుగా టీఆర్ఎస్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని వివరించారు. జగన్ కూడా టీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనకుండా కృతజ్ఞత ప్రదర్శించాడని అన్నారు. భారీ వర్షాల కారణంగా రైళ్ళను ఎక్కడివక్కడే నిలిపివేసినా, జగన్ సభ కోసం 18 ప్రత్యేక రైళ్ళను నడిపారని బాబు విమర్శించారు. ప్రజలకు అవసరమైన రైళ్ళను రద్దు చేసి, జగన్ కోసం రైళ్ళను నడపడంతోనే కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమవుతోందని బాబు దుయ్యబట్టారు.